Tuesday, April 23, 2024

విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న మహేష్ హీరోయిన్ ?

సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరోయిన్ కృతి సనన్. ఆ తర్వాత కృతిసనన్ తెలుగులో పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయబోతుండట కృతి.

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుందట. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement