Wednesday, September 25, 2024

krithi Shetty | చీరకట్టులో బేబ‌మ్మ‌ క్యూట్ ఫోటోలు!

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా విడుదల అవ్వక ముందే మూడు నాలుగు సినిమాలకు సైన్‌ చేసిన ఈ అమ్మడు ఉప్పెన సూపర్‌ హిట్ అవ్వడంతో మరో నాలుగు అయిదు సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ ఓకే చెప్పింది.

సోషల్‌ మీడియాలోనూ కృతి శెట్టికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ దక్కింది. వరుసగా మూడు నాలుగు సినిమాలతో సక్సెస్‌ లను దక్కించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా నిరాశ పరుస్తూ వచ్చాయి. తమిళ్‌ లో మూడు సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు మలయాళంలో చేసిన ‘ఏఆర్‌ఎం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మలయాళంలో ఈమె చేసిన సినిమాకి పాజిటివ్ టాక్‌ దక్కింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌ ఆరంభంలో స్కిన్‌ షో కి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ గా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

అందుకోసమే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె చీర కట్టు ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నడుము అందాన్ని చూపిస్తూ చూపు తిప్పుకోనివ్వని బేబమ్మ కృతి శెట్టి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement