Thursday, April 25, 2024

కృష్ణ‌వంశీ రంగ‌మార్తాండ‌.. లిరిక‌ల్ సాంగ్

ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం రంగ‌మార్తాండ‌. ఈచిత్రం నుండి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. పొదల పొదల గట్ల నడుమ అనే సాంగ్ ని స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళయరాజా స్వరపరిచారు. ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సింగ‌ర్ రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించారు. రాహుల్ సిప్లి గంజ్ – శివాత్మిక జంటగా నటించారు నేను అనే అహంభావాన్ని … నాది అనే స్వార్థాన్ని విడిచిపెట్టి చూడు, జీవితం చాలా అందంగా కనిపిస్తుంది అనే అర్థంలో ఈ పాట సాగుతోంది. టైటిల్ ను బట్టే ఇది ఒక నాటకరంగానికి చెందిన వ్యక్తి చుట్టూ తిరిగే కథ అనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన సీతారామశాస్త్రి పాట సాహిత్యం పరంగా పాప్యులర్ అయింది. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. ప్ర‌కాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ‘రంగమార్తాండ’ విడుదలకు ముస్తాబవుతోంది. కాలెపు మధు – వెంకట్ రెడ్డి నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement