Friday, March 29, 2024

కృష్ణంరాజు పాత్ర అదే@రాధే శ్యామ్

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రీ షూట్ లో భాగంగా మరో పది రోజులు షూటింగ్ ను షెడ్యూల్ చేసింది. మొన్ననే ఈ సినిమా కు సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణంరాజు ఈ సినిమాలో ఫిలాసఫర్ పరమహంస పాత్రలో నటిస్తున్నాడట. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయిందట. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement