Thursday, April 25, 2024

ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై కొరటాల మరోసారి ఫోకస్ !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడట. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆచార్య సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ ను ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కోసం ఉపయోగిస్తున్నాడట కొరటాల.

నిజానికి ఎప్పుడో రెడీ అయిన ఈ స్క్రిప్ట్ కు ఎన్టీఆర్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు కొరటాల ఫిక్స్ అయ్యాడట. అందుకే మరోసారి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర లో కూడా చాలా వేరియేషన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట కొరటాల. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 22న 2022 లో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement