Friday, March 29, 2024

కోలీవుడ్ సంగీత దర్శకుడు మృతి

కోలీవుడ్ సంగీత దర్శకుడు టీఎస్ మురళీధరన్ చెన్నైలో కన్నుమూశారు. 2002 లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ శ్రీ మూవీ తో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు మురళీధర్. సూర్య నటించిన ఈ చిత్రంకు పుష్ప వాసగన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ… సంగీతం పరంగా పర్వాలేదనిపించింది.

అయితే ఆ తర్వాత మురళీధరన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. 2020లో గోదామ్ సినిమాకు నేపథ్య సంగీతం అందించారు. కాగా మురళీధరన్ మృతి పట్ల ప్రస్తుతం కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement