Friday, April 19, 2024

యువరాణి గా కీర్తి సురేష్

పోర్చుగీసు వారిని ఎదిరించి పోరాడిన నావికా అధికారి కుంజాలీ మరక్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మరక్కర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సంగీత కళాకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి యువరాణిగా పట్టాభిషిక్తురాలు అయ్యే యువతిగా కీర్తి సురేష్ పాత్ర ఉండనుందని సమాచారం.

కాగా తాజాగా సోషల్ మీడియాలో నిండా బంగారు ఆభరణాలతో రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో ఒక ఫోటో పోస్ట్ చేసింది కీర్తి. తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచే పాత్ర ఇదని చెప్పుకొచ్చింది కీర్తి.

Advertisement

తాజా వార్తలు

Advertisement