Thursday, April 25, 2024

కోడి రామకృష్ణ కూతురుతో కిరణ్ అబ్బవరం సినిమా ?

రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది. అయితే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకు సంబంధించి పాటలు, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో సినిమాకు ఓకే చెప్పాడు కిరణ్.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో ఆయన పెద్ద కుమార్తె కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కిరణ్ కి 5వ చిత్రం. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందిస్తుండగా… కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని మిగిలిన విషయాలను తెలియజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement