Wednesday, March 27, 2024

కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్… ఎస్ ఆర్ కళ్యాణమండపం టీజర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా… తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటిస్తున్నారు. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ఇదిలా ఉండగా తాజాగా హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా నేడు చిత్రయూనిట్ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేసింది. 33 సెకన్ల నిడివితో కిరణ్ అబ్బవరం పాత్ర కి సంబంధించి మాత్రమే చూపించారు. ఇక ఈ సినిమాకు శ్రీధర్ గాదె డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement