Friday, March 29, 2024

ఖిలాడి రిలీజ్ డేట్ వాయిదా…ఆఫీషియల్

కరోనా కారణంగా చాలా వరకు సినిమా షూటింగులు నిలిచిపోతున్నాయి. మరోవైపు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ చేసుకుంది.అలాగే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమా కూడా రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంది. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా ఖిలాడీ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు.

ఈమేర అధికారిక ప్రకటన విడుదల చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రాక్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత రవితేజ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను మే 28 న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement