Friday, April 26, 2024

పుష్ప కన్నా ముందే కేజీఎఫ్ 2 ?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పుష్ప చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా కేజిఎఫ్2 సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ లో ఎప్పటి నుంచో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇందులో క్రిస్మస్ కానుకగా పుష్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

దీనితో కేజిఎఫ్2 రిలీజ్ పై మరింత ఆసక్తి నెలకొంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. డిసెంబర్ లో పుష్ప కన్నా 5 రోజుల ముందు… డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతుందట. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement