Thursday, April 25, 2024

టాప్ 5 టీజర్స్ లో టాప్ లో కేజీఎఫ్2

గతంలో ఓ సినిమా రిలీజ్ అయింది అంటే ఎన్ని సెంటర్లలో ఎన్ని రోజులు ఆడింది ఎంత కలెక్షన్ చేసింది అని చూసే వాళ్ళు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగల్, టీజర్, ట్రైలర్ ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో రికార్డులను లెక్కిస్తున్నారు అభిమానులు. మొదట ఓ టీజర్ గాని ట్రైలర్ గాని మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సాధించాలంటే గగనం లా కనిపించేది. కానీ ఇటీవల వందలకొద్దీ మిలియన్ల వ్యూస్ రాబెడుతున్నాయి.

ఇక 25 మిలియన్ల వ్యూస్ ను అతి తక్కువ సమయంలో దక్కించుకున్న సినిమాల టీజర్ ల లిస్ట్ లో కే జి ఎఫ్ 2 మొదటి స్థానంలో నిలిచింది. కే జి ఎఫ్ 2 కేవలం 15 గంటల్లో పాతిక మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. రెండవ స్థానంలో అల్లు అర్జున్ టీజర్ ఇరవై ఆరు గంటల లో దక్కించుకుంది. ఇక మూడవ స్థానంలో విజయ్ దళపతి నటించిన మాస్టర్ టీజర్ నిలిచింది. 48 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ సాధించింది. అలాగే నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా టీజర్ 25 మిలియన్ల ఐదురోజుల 19 గంటల్లో దక్కించుకుంది. ఇక 5వ స్థానంలో ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ఆరు రోజుల 12 గంటల్లో దక్కించుకుంది. సినీ ఇండస్ట్రీలో టాప్ ఫైవ్ లో ప్రస్తుతానికి ఇవే నడుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement