Friday, April 19, 2024

“కేజిఎఫ్-2” రిలీజ్ డేట్ ఫిక్స్..

మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజిఎఫ్ చాప్టర్ 2” అనుకున్న సమయానికే విడుదలకు సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ‘కేజిఎఫ్’కు సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు, హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14 న పలు భాషల్లో విడుదల కానుంది.

ముందుగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఈ ఏడాది జూలై 16 న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తయిపోయినప్పటికీ కరోనా కారణంగా విడుదల ఆలస్యమైంది. దీంతో సినిమాను ఓటిటిలో విడుదల చేస్తారనే వార్తలు విన్పించాయి. ఆ తరువాత క్రిస్మస్ కానుకగా మూవీ రిలీజ్ అవుతుందని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ “కేజిఎఫ్ : చాప్టర్ 2” థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: పవన్ తో సమానంగా చూడటం ఆనందకరం కాని..: సంపూర్ణేష్‌ బాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement