Friday, March 29, 2024

బుట్టబొమ్మ పాటకు కార్తీక్ ఆర్యన్ స్టెప్పులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠ‌పుర‌ములో మూవీ మంచి విజ‌యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పూజా గ్లామర్‌కు తమన్ అందించిన మ్యూజిక్ తోడవడంతో థియేటర్లలో బొమ్మ దద్దరిల్లింది. ఈ సినిమాలో బుట్ట‌బొమ్మ సాంగ్‌ సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసింది. ఈ పాటకు ఎంతో మంది ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో మంది బుట్టబొమ్మ పాటుకు స్టెప్పులేశారు. చిన్నా పెద్ద నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ ఈ పాట‌కు డ్యాన్స్ చేశారు. ఈ లిస్టులో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్య‌న్‌ కూడా చేరాడు. బుట్టబొమ్మ సాంగ్ కు తనదైన స్టైల్ లో స్టెప్స్‌తో కార్తీక్ ఆర్య‌న్ ఆక‌ట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement