Saturday, April 20, 2024

బుట్ట బొమ్మ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసిన కార్తీక్ ఆర్యన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం అలా వైకుంఠపురములో. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా గతంలో ఈ పాటకు డేవిడ్ వార్నర్, శిల్పాశెట్టి, దిశాపటాని మొదలైన వారు వారి వారి స్టైల్ లో డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసే వారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ ఇదే పాటకు అదిరిపోయే డాన్స్ చేశారు.

విశేషం ఏంటంటే అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ఏవి కూడా కార్తీక్ ఆర్యన్ వేయలేదు. హిప్ అప్ తరహాలో కార్తీక్ డాన్స్ చేశాడు. ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కార్తీక్ ఆర్యన్ సొంత స్టెప్పులతో డాన్స్ చేయడంతో ఈ వీడియోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/CP71jfLjZR3/?utm_source=ig_web_copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement