Wednesday, April 24, 2024

ఓటీటీలోకి రానున్న కార్తీ స‌ర్దార్‌.. ఆహాలో 24నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ చిత్రం “సర్దార్”. తమిళంలో మంచి థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి కార్తీ కెరీర్ లో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది. మరి తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకుని హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకోవచ్చింది.

ఇక.. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కానున్న‌ట్టు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ‌ భాషల్లో ఓటిటి హక్కులను ఆహా సంస్థ కొనుగోలు చేసింది. దీంతో ఈ సినిమా నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించగా ప్రిన్స్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement