Thursday, December 1, 2022

400 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టనున్న కాంతార.. ఓటీటీ రిలీజ్ అప్పుడే..

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించన సూపర్ నేచురల్ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్‌ మూవీ కాంతారా. ఈ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషలలో కూడా రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌లను సాధించి భారీ బాక్స్ ఆఫీస్ హిట్‌గా నిలిచింది కాంతార సినిమా.

- Advertisement -
   

ఇక, కాంతారా డిజిటల్ ప్రీమియర్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే.. కాగా, ఈ సినిమా నవంబర్ 18న అంటే రేపు ఓటీటీలో రానుంది అని ప్రచారం చేశారు. అయితే, కాంతారా కలెక్షన్లు ప్రస్తుతం రూ.369 కోట్లుగా ఉన్నాయి.. దీంతో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌ను ఒక వారం పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఎందుకంటే మరో వారం రోజుల్లో ఈ మూవీ రూ.400 కోట్ల క్లబ్ లో చేరుతుందని వారు బావిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వారం రోజులు ఆలస్యంగా.. అంటే (నవంబర్ 24) వచ్చే గురువారానికి వాయిదా పడినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement