Thursday, April 25, 2024

హార్ట్ ఎటాక్ తో క‌న్నుమూసిన.. క‌న్న‌డ న‌టుడు

హార్ట్ ఎటాక్ తో క‌న్నుమూశారు కన్నడ యువ నటుడు నితిన్ గోపీ.ఆయ‌న వ‌య‌సు 39. దీంతో శాండల్ వుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే నితిన్ కు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. నితిన్ అకాల మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.నితిన్ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. నితిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను ప్రారంభించారు. ముత్తినంత హఎంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే నితిన్ ‘హర హర మహాదేవ్’ భక్తి సీరియల్ లోనూ కొన్ని ఎపిసోడ్లలో నటించారు. అదేవిధంగా తమిళంలోని కొన్ని సిరీయల్స్ లోనూ నటించి మెప్పించారు. త్వరలో నితిన్ దర్శకత్వంలోనే ఓ సీరియల్ కు ఏర్పాట్లు జరుగుతుండ‌గా ఈ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement