Saturday, April 20, 2024

కంగనాకు కరోనా నెగటివ్

బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ కరోనా నుంచి కోలుకుంది. తనకు కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు ఆమె తెలిపింది. ఈ నెల 8న తనకు కరోనా సోకినట్టు కంగన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనాను తాను ఎలా ఎదుర్కొన్నాననే విషయాన్ని చెప్పాలని తనకు ఉన్నప్పటికీ… కోవిడ్ ఫ్యాన్ క్లబ్స్ ను నిరాశపరచాలనుకోవడం లేదని చెప్పింది. వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే మనను విమర్శించే వారు కూడా ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానించింది. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది

Advertisement

తాజా వార్తలు

Advertisement