Thursday, March 28, 2024

ఇండియా పేరుని విడనాడండి…కంగనా హాట్ కామెంట్స్

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి తన మాటలతో వార్తలకెక్కారు కంగనా. బ్రిటిష్ వారు బానిసత్వానికి చిహ్నంగా మనకు పెట్టిన ఇండియా అనే పేరు ని వదిలేసి భారత్ గా దేశం పేరు మార్చుకుందని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఇటీవల ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా కంగనా 2 పోస్టు పెట్టింది. ఇండస్ నదికి తూర్పున ఉన్న కారణంగా మన దేశానికి బ్రిటిష్ వారు ఇండియా అనే పేరు పెట్టారని… అది బానిసత్వానికి చిహ్నమని అన్నారు.

భారత అనే మూడు సంస్కృత అక్షరాలలో ఎంతో అర్థం ఉందని…భా భావ, ర…రాగ, త..తాల్ గా వివరించింది. వేదాలను, భగవద్గీతను యోగాను అధ్యయనం చేయాలని కోరింది. మన పూర్వీకులు మనకు ఇచ్చిన విజ్ఞానాన్ని నాగరికతను ప్రతి ఒక్కరూ అనుసరించాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement