Wednesday, July 28, 2021

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా… సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయారు. కానీ ఇటీవల కాలంలో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు కళ్యాణ్ రామ్. లైన్ లో పెట్టడమే కాకుండా షూటింగ్ ను కూడా శరవేగంగా చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ లో బింబిసార సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. దీంతోపాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర అనే నూతన దర్శకుడు తో మరో సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సంగీత దర్శకుడు గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ… గిబ్రాన్ సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోని పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News