Thursday, April 25, 2024

మా ఎన్నికల బరిలో కళ్యాణ్ రామ్ ? ఫేక్ న్యూస్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇండస్ట్రీ లో రచ్చ మొదలైంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్, నటి హేమ, మంచు విష్ణు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ ని కూడా ప్రకటించేశాడు. మాములుగా మా కార్యవర్గంలో ఎగ్జిక్యూటివ్ నెంబర్ తో కలిపి మొత్తం 24 మంది మాత్రమే ఉంటారు.

అయితే ప్రకాష్ రాజ్ విడుదల చేసిన జాబితాలో చూసుకుంటే అందరూ పోటీ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. అయితే మా ఎన్నికల బరిలో ఇప్పటివరకు అనుకుంటున్న నాలుగు ప్యానల్స్ లో కూడా రకరకాల వ్యక్తుల పేర్లు వినిపించగా… నందమూరి కళ్యాణ్ రామ్ పేరు సైతం వినిపించింది. అయితే కళ్యాణ్ రామ్ మా ఎన్నికల్లో నిలబడుతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన అధికార ప్రతినిధి చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని… నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్నికలలో నిలబడటం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement