Friday, March 29, 2024

ఖైదీ రీమేక్ లో కాజల్ ?

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలను ఓకే చేస్తుంది. ఎక్కువగా సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. అక్కినేని నాగార్జున ,చిరంజీవి, కమల్ హాసన్ వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన కూడా ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఖైదీ. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించింది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. నిజానికి ఇందులో హీరోయిన్ పాత్ర లేదు. కానీ హిందీ వెర్షన్ లో హీరోయిన్ పాత్ర ఉండి తీరాల్సిందే అని ఆ పాత్రను ప్రత్యేకంగా సృష్టించారట. అయితే అజయ్ దేవగన్ తో కాజల్ కి ఇది రెండవ చిత్రం. గతంలో సింగం సినిమాతో ఈ ఇద్దరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement