Wednesday, April 24, 2024

నాని సినిమాకు…ఐదుగురులో ఒకరు కాజల్ !!

నాచురల్ స్టార్ నాని హీరోగా రాణిస్తునే మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని మీట్ క్యూట్ అనే ఓ ప్రత్యేకమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నాని సోదరి దీప్తి గంట దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. విశేషమేమిటంటే ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారు. ఆ హీరోయిన్ల పేర్లను ఒక్కో సందర్భంలో వెల్లడిస్తామని నాని చెప్పుకొచ్చారు.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అందులో ఓ కథానాయికగా చేప కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ నటిస్తోందట. స్క్రిప్ట్ తో పాటు తన పాత్ర కూడా ఎంతగానో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కాగా మిగతా హీరోయిన్స్ నివేద థామస్, ఆదా శర్మ తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళ స్టార్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement