Saturday, April 20, 2024

‘వకీల్ సాబ్’ నుంచి మరో అదిరిపోయే సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి ‘కదులు కదులు కట్లు తెంచుకుని కదులు’ అంటూ సాగే గీతాన్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ గీతాన్ని సీనియర్ లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ రాశారు. ఈ స్ఫూర్తిదాయక గీతానికి తమన్ తన స్టైలులో అందించిన సంగీతం మరింత ఊపు తెచ్చేదిగా ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ‘వకీల్ సాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ నుంచి విడుదలైన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. తాజాగా విడుదలైన ‘కదులు కదులు’ పాటకు కూడా విశేష స్పందన లభిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement