Thursday, April 25, 2024

K.G.F-2 TRAILER : “ర‌క్తంతో రాసిన క‌థ ఇది…” గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ట్రైల‌ర్..

కన్నడ స్టార్ హీరో ‘యష్’ ప్రధాన పాత్రలో నటించిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో యష్ అన్ని భాషల్లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.

కేజీయఫ్‌ చాప్టర్‌ 2 సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో.. చిత్రబృందం ప్రమోషన్స్ మొదలెట్టింది. కొద్డి సేప‌టి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ చ‌ర‌ణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయటం సంతోషంగా ఉందని పేర్కోన్నాడు చ‌ర‌ణ్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement