Thursday, April 25, 2024

చిన్న గాయాలే.. నో ప్రాబ్ల‌మ్.. ఆదాశ‌ర్మ ట్వీట్

ఎన్నో వివాదాల న‌డుమ రిలీజ్ అయి రూ.100కోట్ల వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది ది కేర‌ళ స్టోరీ. కాగా ఈ చిత్రంలో న‌టి ఆదాశ‌ర్మ న‌టించింది. తాజాగా ఈమె దర్శకుడు సుదీప్ తో కలిసి వెళుతుండగా వీరిద్దరికీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వీరిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు వీరి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయడం మొదలుపెట్టారు. వీటన్నిటిపై ఒక క్లారిటీ ఇస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని చిన్న గాయాలతో బయటపడ్డాను అంటూ తెలిపింది ఆదాశర్మ.యాక్సిడెంట్ వార్త తెలియడంతో అందరూ కంగారు పడుతున్నారు. దీంతో నాకు ఎన్నో మెసేజ్స్ వస్తున్నాయి. సీరియస్ ఏమి లేదు. స్వల్పంగా గాయపడ్డాం అంతే. నేను, మా మూవీ టీం మొత్తం బాగానే ఉన్నాం .. అంటూ ట్వీట్ చేసింది. దాంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement