Friday, April 19, 2024

బాల బాబాయ్ కు యంగ్ టైగర్ విషెస్

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు విషెస్ లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టైగర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్ బాలకృష్ణకు విషెస్ తెలిపారు. ఇక తారక్ విషెస్ తో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తారక్ విషెస్ తెలుపుతూ… బాల బాబాయ్ జన్మదిన శుభాకాంక్షలు… మీరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల విషయానికొస్తే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక తారక్ విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే ప్రశాంత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement