Friday, December 6, 2024

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు హోస్ట్ గా ఎన్టీఆర్

రండి గెలుద్దాం… ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ అంటున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి  ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ అంటూ అల‌రించారు. ఈసారి ఈ షో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేయనున్నాడు. జెమినీ టీవీలో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ప్రొమో తోనే ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు.

.ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ‘కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది’ అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న ప్ర‌త్యేక‌ డైలాగులు అల‌రిస్తున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో అది సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు. ఇందులో ఆయ‌న కొత్త గెట‌ప్‌లో క‌న‌ప‌డుతున్నాడు.

https://youtu.be/quA5vQOeTyU

Advertisement

తాజా వార్తలు

Advertisement