Tuesday, March 19, 2024

31వ సినిమా తనతోనే…ఎన్టీఆర్ !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ 31 వ సినిమాకు సంబంధించి కూడా కొన్ని వార్తలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అందరూ అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ ఉండబోతుందట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా స్పష్టంచేశారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ ఒక ఇంగ్లీష్ డైలీ తో ఫోన్లో మాట్లాడారు. కెరియర్ పరంగా తన 31వ సినిమాను ప్రశాంత్ తో చేయనున్నట్లు చెప్పారు. కొరటాల సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుందని తెలిపాడు. ఇక ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమా తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement