Tuesday, January 18, 2022

బాబాయ్ కోసం రంగంలోకి దిగిన అబ్బాయ్?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బిబి3. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ రోర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మాత్రం చిత్రయూనిట్ ప్రకటించలేదు.

మరోవైపు ఈ చిత్రాన్ని మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు ఆ టైటిల్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ అదే కనుక కన్ఫామ్ అయితే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News