Saturday, April 20, 2024

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఎప్పుడంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ త్వరలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబోలో రాబోతున్న సినిమాని ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు  సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు.

ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేసి.. మే నుంచి రెగ్యూలర్ గా షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోపు షూటింగ్ పూర్తి చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement