Thursday, April 25, 2024

బంగార్రాజు లో సీనియర్ హీరోయిన్ ?

అక్కినేని నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన. ఈ చిత్రంలో రమ్యకృష్ణ లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా కూడా తెరకెక్కబోతోంది. అయితే జూలై నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద కోసం ఓ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట దర్శకుడు. ఆమె క్యారెక్టర్ సినిమాలో కీలకంగా ఉండనుందట.

మొదట చైతు నాగ్ కలయికలో ఈ సినిమా రానుందని వార్తలు వచ్చాయి. కానీ చైతన్య గెస్ట్ రోల్ మాత్రమే ఈ సినిమాలో పోషిస్తున్నాడట. చైతు కొడుకు పాత్రలో అక్కినేని అఖిల్ కనిపిస్తాడని ఈ సినిమా మొత్తం బంగార్రాజు అతని మనవడు అఖిల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇక ఎప్పుడో మొదలవ్వాల్సి న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement