Friday, April 19, 2024

జ‌పాన్ మూవీ ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో- కార్తి స్టైల్ అదిరిందిగా

త‌మిళ హీరో కార్తి న‌టిస్తున్న తాజా చిత్రం జపాన్‌.ఈ మూవీ ఇంట్రడక్షన్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. తెలుగు వెర్షన్‌ను హీరో విజయ్‌ దేవరకొండ లాంఛ్ చేశారు. మీరనుకుంటున్నట్టు కాదు.. వాడు దూల తీర్చే విలన్‌.. అంటూ టైటిల్‌ రోల్‌ గురించి సునీల్ చెబుతున్న డైలాగ్స్‌తో స్టైలిష్‌ ఎంట్రీ ఇచ్చారు హీరో కార్తీ. కొత్తదనంతో కూడిన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చే కార్తీ ఈ సారి కూడా సూపర్ హిట్టు కొట్టబోతున్నట్టు తాజా వీడియోతో అర్థమవుతోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ బీజీఎం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్టు తాజా వీడియో చెబుతోంది. జపాన్ చిత్రానికి అన్బరివ్‌ యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. జపాన్‌లో సునీల్, విజయ్‌ మిల్టన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీని డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజా వీడియోతో ప్రకటించేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement