Saturday, April 20, 2024

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఫిక్స్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, కాలేజ్ సినిమాలు మంచి టాక్ ను తెచ్చుకోవటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే త్రివిక్రమ్ ప్రతి సినిమాలోను పెట్టినట్టే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ని పెడుతున్నట్లు సమాచారం.

అందులో లీడ్ రోల్ హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు వినిపించగా మరో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వికపూర్ పేరు వినిపించింది. కాగా తాజా సమాచారం ప్రకారం అది నిజమేనట. ఈ చిత్రంలో రెండవ ఫీమేల్ లీడ్ హీరోయిన్ గా జాన్వికపూర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన ఒకటే ఇంకా రావాల్సి ఉందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement