Saturday, April 13, 2024

యూట్యూబ్ లో అదరగొడుతున్న ఉప్పెన సాంగ్..

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఉప్పెన నుంచి తొలి వీడియో సాంగ్ వచ్చింది. మూవీలో హిట్ అయిన జలజల జలపాతం నువ్వు వీడియో సాంగ్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ముందస్తు సమాచారం లేకుండా సాంగ్ ని యూ ట్యూబ్ లో పెట్టారు. విడుదలవడం ఆలస్యం సాంగ్ కి యూట్యూబ్ లో విపరీతమైన హిట్స్ వస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలకు శ్రేయాఘోషల్‌, జాస్‌ప్రీత్ జాజ్ గాత్రం తోడవడంతో సినిమా విడుదలకు ముందే ఈ పాటకు ఎంతో పాపులారిటీ వచ్చింది. పాటలో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టిల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను ఇప్పటికే 3.9 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. పాట మనుమ్ముందు రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో కనిపించారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ నెల 24 న ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement