Saturday, April 20, 2024

ఆస్కార్‌ అర్హత జాబితాలో జైభీమ్‌, మరక్కర్‌..

ప్రతిష్టాత్మక సినీ పురస్కారాల్లో ఒకటైన ఆస్కార్‌ బరిలో జై భీమ్‌, మరక్కర్‌ చిత్రాలు ఉన్నాయి. గత ఏడాది నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం నమోదు చేసిన జైభీమ్‌ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో గిరిజనుల తరుపున పోరాడిన చంద్రు అనే న్యాయ వాది పాత్రని సూర్య పోషించారు. ఆయనే నిర్మించారు. టీజే. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా 2022 అవార్డులకి నామినేట్‌ కావడానికి ఈ సినిమా అర్హత కలిగిన జాబితాలో ఉంది. ఫిబ్రవరిలో పూర్తి నామినేషన్‌ జాబితా వస్తుంది. ప్రస్తుతానికి అర్హత లిస్ట్‌లోఉంది. 2021వ సంవత్సరంలో కూడా సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా ఆస్కార్‌ బరిలో నిలిచింది.

ఈ సినిమాతో పాటు మోహన్‌ లాల్‌ మరక్కర్‌ కూడా ఆస్కార్‌ అర్హత జాబితాలో చోటు- సంపాదించుకుంది. చారిత్రక నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదలైంది. ఇందులో మోహన్‌ లాల్‌ కుమారుడు ప్రణవ్‌ కూడా నటించారు. కుంజలి మరక్కర్‌ జీవితం ఆధా రంగా మరక్కర్‌ తీశారు. మలయాళంలో తీసిన అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమాను పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు దక్కాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement