Friday, March 29, 2024

సలార్ లో విలన్ గా జగ్గూభాయ్ ?

కేజిఎఫ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా సగభాగం పూర్తయింది. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన సెట్ లో కూడా అడుగు పెట్టినట్లు సమాచారం. అయితే ఆయన పాత్ర ఏంటి అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కొన్ని రోజుల క్రితం విలన్ కోసం ప్రత్యేకంగా సెట్ ను నిర్మిస్తున్నట్లు, అలాగే విలన్ కూడా జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని బట్టి చూసుకుంటే సలార్ లో విలన్ గా జగపతిబాబు కనిపించబోతున్నాడనే అనుమానం కలుగుతోంది. కాగా విలన్ ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర యూనిట్ కూడా దానిని సీక్రెట్ గా ఉంచుతుంది. ఏప్రిల్ 14 2022 లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement