Friday, April 19, 2024

ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెడుతున్న జగపతిబాబు

ఇటీవల టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆనందయ్య ఆయుర్వేద మందు ను సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ఆనందయ్య మందును తీసుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఈ మందును తీసుకోవాలని చెప్పుకొచ్చాడు.

పూర్తిస్థాయిలో ఆనందయ్య మందుకు సపోర్ట్ గా నిలిచారు జగపతిబాబు. కాగా తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు త్వరలో ఆయుర్వేదిక్ బిజినెస్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాను జూబ్లీహిల్స్ లో నిర్మిస్తున్న ఆయుర్వేదిక్ హాస్పిటల్ తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని నెలల్లో ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ హాస్పిటల్ కు జగపతిబాబు డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement