Wednesday, March 27, 2024

బాలయ్య సినిమాలో మళ్ళీ జగపతిబాబు

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తమిళనాడులోని విల్లుపురం కు చెందిన వెంకటరమణ దేవాలయంలో జరుగుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అలాగే సినిమాపై క్రేజ్ ను కూడా పెంచింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో జగపతి బాబు కూడా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది . ఇప్పటికే బాలయ్య లెజెండ్ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించారు. స్టైలిష్ లుక్ లో ఆ సినిమాతో ఆకట్టుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement