Thursday, April 25, 2024

జాక్వలిన్… ఓ రాకుమార్తె !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా జాక్వలిన్ ఫెర్నాండెజ్ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

తాజాగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ చిత్రంలో ఓ రాకుమారి పాత్రలో కనిపిస్తానని తెలిపింది. అలాగే పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగాక షూటింగ్ మొదలు కానుంది. గతంలో జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ సాహో చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement