Thursday, April 25, 2024

ఐటమ్ సాంగ్ పార్ట్2 లోనే ఉంటుంది…!!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అలాగే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మరో వైపు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఈ ఏడాది దసరా కి వచ్చే ఒక పార్ట్ ను ఇంకో భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు. ఇక మామూలుగా సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ సినిమా అంటే కచ్చితంగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇక పుష్పా కి కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు. ఆ ఐటెం సాంగ్ లో ఊర్వశి రౌతెలా కనిపించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు పూజా హెగ్డే, దిశా పటాని పేర్లు పరిశీలిస్తున్నామని నిర్మాతలు చెప్పారు. అంతేకాకుండా రెండవ పార్ట్ లో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement