Thursday, April 25, 2024

ఎఫ్-3లో మూడో హీరో ఎవరో తెలిసిపోయింది?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడని ప్రచారం జరిగింది. ఆ మూడో హీరో మహేష్ బాబు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అనిల్ రావిపూడి స్పందిస్తూ… మహేష్ బాబును సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్, పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందట. మరోవైపు ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించబోతున్నాడట. వెంకీ, వరుణ్ తో కలిపి సునీల్ కూడా సినిమా ఆద్యంతం కామెడీ పండిస్తారని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే మూడవ హీరో సునీలేనని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement