Tuesday, May 18, 2021

ఇది కదా కావాల్సింది – చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆచార్య సినిమాలో కూడా చరణ్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే సందిగ్ధంలో ఉన్న అభిమానులకు క్లారిటీ ఇస్తూ తన తర్వాత సినిమా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారట. అంతేకాదు ఈ రోల్ ను శంకర్ చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో మాత్రం తెలియట్లేదు. ఒకవేళ అదే కనుక నిజమైతే చరణ్ అభిమానులు కోరిక తీరినట్టే.

Advertisement

తాజా వార్తలు

Prabha News