Wednesday, April 14, 2021

9 ఇయర్స్ @రచ్చ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన చిత్రం రచ్చ . ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన తమన్నా నటించింది. 2012 లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. ఆ రోజుల్లో ఐదు కేంద్రాలలో వంద రోజులకు పైగా ప్రదర్శింపబడింది. కాగా ఈ చిత్రం నేటికీ రిలీజ్ అయి సరిగ్గా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది.

2012 ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సందర్భంగా గా సోషల్ మీడియాలో మెగా అభిమానులు చిత్ర యూనిట్ కి విషెస్ తెలుపుతున్నారు. #9YearsForBOSensationRACHA పేరుతో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News