Tuesday, April 23, 2024

జూలై 30న ఇష్క్ రిలీజ్..ఆఫీషియల్

సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఇష్క్ చిత్రం జూలై 30న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఎస్ ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది.

కాగా ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించగా… శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, జైన్ ,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement