Wednesday, April 24, 2024

‘వకీల్ సాబ్ 2’ ప్లాన్ రెడీ ?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఘన విజయం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉండగా వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం నచ్చి వేణు శ్రీరామ్ కు మరో అవకాశం ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అలాగే దిల్ రాజుకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ ముగ్గురి కాంబినేషన్ లో వకీల్ సాబ్ 2 ప్లాన్ చేస్తున్నారట.

నిజానికి వేణు శ్రీరామ్ కి మొదట ఈ ఆలోచన లేదట. కానీ చాలా మంది తనకు వకీల్ సాబ్ కు సీక్వెల్ చేయాలని కోరుతున్నట్లు వేణు శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పటికే స్టోరీ కూడా రెడీ చేయాలని భావిస్తున్నాడట. మరోవైపు వకీల్ సాబ్ సీక్వెల్ చేస్తే కచ్చితంగా హిట్ కొట్టగలనని కాన్ఫిడెంట్ తో వేణు శ్రీరామ్ ఉన్నాడట. మరి వకీల్ సాబ్ 2 సినిమా కు వేణు శ్రీరామ్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement