Thursday, March 28, 2024

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు ‘నో ‘ చెప్పటానికి కారణం ఇదే ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రాబోతున్నట్లు మొదట ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అనూహ్యంగా త్రివిక్రమ్ ను తప్పించి కొరటాల శివతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. కాగా త్రివిక్రమ్ ను తప్పించడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ ఈజీ గా తీసుకున్నాడట. ప్రాజెక్టు ప్రకటించిన సంవత్సరం తర్వాత కూడా ఫైనల్ డ్రాప్ట్ తో రాలేదట. ఎన్టీఆర్ నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. కానీ త్రివిక్రమ్ పద్ధతి నచ్చక ఈ సినిమాని పక్కన పెట్టాడట. ఈ నేపథ్యంలోనే స్క్రిప్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే కొరటాల శివకు తన 30వ సినిమా బాధ్యతలు అప్పగించాడట ఎన్టీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement