Thursday, April 18, 2024

పవన్ హరీష్ సినిమా అప్డేట్ కు కారణం అదేనా ?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహారబీవీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు అయ్యప్పనుమ్, కొషియమ్ రీమేక్ చిత్రాలలో కూడా నటిస్తున్నాడు. అలాగే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ను ఆకస్మికంగా నిర్మాణ సంస్థ ఇచ్చింది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను మంచి సమయం చూసి విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ అప్డేట్ ఇవ్వడానికి కారణం ఓ ఫ్యాన్ మెడ్ ఎడిట్ పోస్టర్ అని తెలుస్తోంది. దీంతో దర్శకుడు కూడా స్పందించాల్సి వచ్చింది అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ టైటిల్ ను ఫస్ట్ లుక్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement