Friday, April 26, 2024

రాధే శ్యామ్ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధేశ్యామ్. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వంవహిస్తున్నాడు. అలాగే ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, మోషన్ పోస్టర్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నిజానికి ఈ సినిమా జూలై 30న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం సినీ అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ పై ఓ అప్డేట్ బయటికి వచ్చింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ అధికారిక పోస్టర్ తో ప్రకటించనున్నారట. కాగా దర్శకనిర్మాతలు అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ ఇదే నిజమట.

Advertisement

తాజా వార్తలు

Advertisement